తొలి శుభోదయం ఒంగోలు:-
ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీ ( ఎస్.ఐ.ఆర్ )-2026లో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్ల
మ్యాపింగ్ లో సాధించిన పురోగతికిగాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ -2025కు ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. 2002 ఎస్.ఐ.ఆర్. డేటాతో 2026 ఎస్.ఐ.ఆర్. డేటాను సరిపోల్చటంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు.