తొలి శుభోదయం కందుకూరు:-
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. కందుకూరు నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాలో కలిసిన సందర్భంగా, కలెక్టర్ ను కలిసి శాలువాతో సత్కరించారు. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, బెజవాడ ప్రసాద్ పాల్గొన్నారు