తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అక్రమ బెల్ట్ షాపులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.దోర్నాల ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో, బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి 1 ఫుల్ బాటిల్ మరియు 19 క్వార్టర్ (180 ఎం.ఎల్) మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకున్నారు.అక్రమ మద్యం విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *