తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా జిల్లాలో MSCD (Mobile Surveillance & Criminal Detection) వ్యవస్థ ద్వారా పరాయి వ్యక్తులు, అనుమానితులను తనిఖీ చేసింది.ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పోలీస్ అధికారులు ప్రజాసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, లాడ్జీలు, మార్కెట్ ప్రాంతాలు మరియు గ్రామ/పట్టణ పరిధుల్లో సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తుల వివరాలను MSCD ద్వారా పరిశీలించారు. వారి గుర్తింపు వివరాలు, గత నేరాల చరిత్ర ఉన్నదా లేదా అన్న అంశాలను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో తనిఖీ చేశారు.నేరస్తుల కదలికలను ముందుగానే గుర్తించి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ఇలాంటి సాంకేతిక ఆధారిత తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 / 100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *