తేదీ 06.12.2025న 63 వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కవాతుకు ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ముఖ్య అతిధిగా హాజరై గౌరవ వందనం స్వీకరించినారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై నుండి పెరేడ్ గ్రౌండ్ లోని హోం గార్డ్స్ ప్లటూన్స్ ను పరిశీలించారు. తదుపరి పరేడ్ కమాండర్ ఎస్పీ యొక్క అనుమతితో కవాతును ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1963లో హోంగార్డ్ వ్యవస్థ ఆవిర్భవించినదని, హోంగార్డుల సేవలు, ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా డిసెంబరు 6న హోంగార్డు రైజింగ్‌ డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రారంభంలో రోజుకి 2 రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఉండగా, ప్రస్తుతం హోంగార్డులు రోజుకు 710 రూపాయలు పొందుతున్నారని, ఇతర విభాగాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారికి 735 రూపాయలు నిర్ణయించారని చెప్పారు. పోలీసులతో సమానంగా పనిచేస్తూ ప్రజల దృష్టిలో హోంగార్డులు కూడా పోలీస్ శాఖలో కీలక పాత్ర పోషించటంలో చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ప్రకాశం జిల్లాలో మొత్తం 696 హోంగార్డులు (వీరిలో 83 మంది మహిళాలు) విధులు నిర్వహిస్తున్నారని, హోంగార్డ్లు పోలీసు శాఖలో అంతర్భాగమని, శాంతిభద్రతల పరిరక్షణలో, బందోబస్తు, నేర నియంత్రణ, టెక్నికల్ విభాగాలలో, ట్రాఫిక్ నియంత్రణ, డయల్ -112, మహిళా పోలీస్ స్టేషన్ లలో, విపత్తుల నిర్వహణలో పోలీసులతో సమానంగా హోంగార్డులు చేస్తున్న సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మొంథా తుఫాన్ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం, ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ఇతర శాఖల అధికారులతో హోంగార్డులు మరియు పోలీసులు కీలక పాత్ర పోషించారన్నారు. జిల్లాలోని హోంగార్డుల సంక్షేమ కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నామని వాటిలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి, లక్ష రూపాయాలు రుణం ఇవ్వటం జరిగిందన్నారు. ప్రతి నెల 50 రూపాయలు వసూలు చేసి—20 రాష్ట్ర నిధికి, 30 జిల్లా హోంగార్డ్ సంక్షేమ నిధికి జమ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి హోంగార్డులకు 5,000 రూపాయలు వరకు సాయం మంజూరు చేస్తారు.డిజిటల్ గుర్తింపు కార్డు, సబ్సిడీ తో వస్తుసరుకులు పొందుటకు పోలీస్ క్యాంటిన్ కార్డ్, మహిళా హోంగార్డులకు మూడు నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవలు, నెలకు రెండు రోజులు జీతంతో కూడిన నెలవులు, హోంగార్డ్ ల కుమారై పెళ్ళికి మరియు మెడికల్ సహాయార్ధం రూ.5000 ఇవ్వటం జరుగుతుందని, విధి నిర్వహణలో మరణించిన హోంగార్డ్స్ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయంగా మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైన సర్వీసులో మరణించిన లేదా ఉద్యోగ విరమణ అయ్యే హోమ్ గార్డుకి జిల్లా హోంగార్డ్స్ యూనిట్ మొత్తం నుండి ఒకరోజు వేతనము వారికి అందిస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖలు హోంగార్డులు పలు రకాల విధులు చక్కగా నిర్వర్తిస్తున్నారని, చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, హోం గార్డ్ లకు పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) రిక్రూట్ మెంటు15% కోటా మరియు APSPలో 25% కోటా మరియు వయోపరిమితి 35 సంవత్సరాలకు పెంచి ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాలలో హోమ్ గార్డ్స్ 9 మంది కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అవ్వటం జరిగింది. అనంతరం హెూంగార్డ్సు సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్ డే నిర్వహించి వాటిపై తగు చర్యలు తీసుకొని సత్వరం పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. సమాజసేవలో పోలీసులతోపాటు హోంగార్డులు నీతి, నిజాయితీ, అంకితభావంతో అహర్నిశలు పనిచేస్తున్నారని,ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మెరుగ్గా పనిచేస్తూ హోంగార్డ్ వ్యవస్ధకు మరియు పోలీస్ శాఖకు ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.జిల్లా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించి మరణించిన హోంగార్డ్ మారుతికుమార్ రెడ్డి (HG.344) సతీమణి తేజశ్వనికి హోంగార్డ్స్ యొక్క ఒకరోజు వేతనము చెక్కు రూ. 4,78,540/- చెక్కును, ఉద్యోగ విరమణ పొందిన జానకి రామయ్య (HG.188)కు హోంగార్డ్స్ యొక్క ఒకరోజు వేతనము చెక్కు రూ.4,80,670 చెక్కులను అందచేసినారు.మొంథా తుఫాన్ సమయంలో సమర్ధవంతంగా విధులు విర్వహించిన హోమ్ గార్డ్స్ ను ప్రత్యేకంగా అభినందించి, ప్రశంస పత్రాలను జిల్లా ఎస్పీ అందచేసినారు.హోమ్ గార్డ్స్ కు స్పోర్ట్స్ మీట్ ను కూడా నిర్వహించామని, వ్యక్తిగత మరియు జట్టు విభాగాల్లో షాట్ ఫుట్, లాంగ్ జంప్,100 మీటర్స్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ మొదలైన ఆటలు నిర్వహించడం జరిగింది. అనంతరం పురుషులు, మహిళలు మొదటి,ద్వితయ,తృతీయ స్థానాలలో నిలిచిన హోమ్ గార్డ్స్ ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం ఎస్పీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి ఆర్.టి.సి బస్టాండ్ వరకు సాగే హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి డిఎస్పీ చిరంజీవి, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డిఎస్పి కె.శ్రీనివాసరావు, సీఐలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నాగరాజు, శ్రీనివాసరావు, శ్రీకాంత్ బాబు, సుధాకర్, పాండు రంగారావు,ఆర్ఐ రమణ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది, హోమ్ గార్డ్స్ కుటుంబాలు మరియు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *