తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో చెడు నడత కలిగిన వ్యక్తులు మరియు సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు చెడు నడతలు కలిగిన వ్యక్తులుకు సమాజంలో శాంతి భద్రతకు భంగం కలిగించే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే వారికి వ్యతిరేకంగా కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ ఇమేజ్‌ను వదిలిపెట్టుకొని సత్ప్రవర్తనతో జీవిస్తూ సమాజంలో కలిసిపోవాలని, మంచి పౌరులుగా మారాలని సూచించారు. భవిష్యత్‌లో ఏవైనా దౌర్జన్యాలు, బెదిరింపులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు. సమాజంలో శాంతి భద్రతను కాపాడేందుకు ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *