తొలి శుభోదయం పొన్నలూరు: –

విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లాలో నేటి నుంచి ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం శనివారం కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తో కలసి ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్ధులతో మాట్లాడుతూ.. పిల్లలలో వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్తాబు కార్యక్రమాన్ని అనన్ని పాఠశాలల్లో, వసతి గృహాలలో అమలు చేయాలని సూచించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత పాటించాలని వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు పరిశుభ్రతపై విద్యార్థులుఅవగాహన కల్పించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందామని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం జల సురక్ష మాసంలో భాగంగా పాఠశాల ఆవరణలో గల వాటర్ ట్యాంక్ ను సందర్శించి వాటర్ ట్యాంక్ క్లీనింగ్ వివరాలను పరిశీలించి సంబంధిత అధికారుల నుండి మంత్రి వివరాలను అడిగితెలుసుకున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *