తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి టౌన్‌లో భద్రతా చర్యల్లో భాగంగా RTC బస్టాండ్, పార్సిల్ ఆఫీస్ గోడౌన్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ డిస్పోజల్ (BD) టీమ్‌తో కలిసి పోలీసులు విస్తృత చెకింగ్‌లు నిర్వహించారు.ప్రయాణికుల భద్రత కోసం బస్‌స్టాండ్‌లోని లగేజీ, పార్సిల్ గోడౌన్‌లో ఉన్న ప్యాకేజీలు, అనుమానాస్పద వస్తువులను నిపుణుల సమక్షంలో శ్రద్ధగా పరిశీలించారు. ఏవైనా అనుమానాస్పద ప్యాకెట్లు, నిర్లక్ష్యంగా వదిలిన లగేజీ, భద్రతకు ముప్పుగా మారే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.జన సందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తూ, ప్రజల భద్రతను కాపాడటం పోలీసుల ప్రాధాన్యత అని అధికారులు తెలిపారు. అనుమానాస్పద వస్తువులు గమనించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
