తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో CASO (Cordon and Search Operations) కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వినియోగం మరియు ఇతర సామాజిక దురాచారాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు, వాటి దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి వివరించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాజాన్ని నేరరహితంగా, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.