తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజల భద్రత కోసం నడుం బిగించింది. జిల్లాలోని కందుకూరు, దర్శి మద్దిపాడు, మరియు ముండ్లమూరు మండలాల్లో పోలీసులు విస్తృతస్థాయిలో రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్, గంజాయి నివారణ, మరియు మహిళలపై నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరు టౌన్ అంబేద్కర్ సెంటర్లో విద్యార్థులకు మరియు ప్రజలకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూనే, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మద్దిపాడులోని గుళ్లపల్లి గ్రోత్ సెంటర్ వద్ద వాహనదారులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించగా, దర్శి పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి 20 హెల్మెట్లను తక్కువ ధరకే పంపిణీ చేసి వాహనదారులను ప్రోత్సహించారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, మహిళల భద్రత కోసం చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే నేరరహిత సమాజం మరియు సురక్షిత ప్రయాణాలు సాధ్యమని స్పష్టం చేస్తూ, బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని పోలీసులు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *