తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా శ్రీ టి. చిరంజీవి రావు గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు.స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూజిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా వ్యవస్థ బలోపేతం, ఇంటెలిజెన్స్ సేకరణలో స్పెషల్ బ్రాంచ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా చేస్తానని తెలిపారు.కార్యక్రమంలో పోలీసులు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.