తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పేకాట శిబిరాలు మరియు అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో కొండపి మండలం దాసిరెడ్డిపాలెం అవుట్‌స్కర్ట్స్‌లో పోలీసులు ఆకస్మిక రైడ్ నిర్వహించి, జూదంలో పాల్గొంటున్న 5 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి నగదు మరియు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి రైడ్లు నిరంతరంగా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.అక్రమ కార్యకలాపాల గురించి మీకు ఏదైనా సమాచారం ఉంటే, వెంటనే Dial 100 కు తెలియజేయగలరు.