తొలి శుభోదయం ప్రకాశం,మార్కాపురం పోలీస్:-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో విస్తృత స్థాయిలో కట్టుదిట్టమైన పోలీస్ తనిఖీలు నిర్వహించబడ్డాయి.ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా విధులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా:అనుమానాస్పద వ్యక్తులను విచారించడం ప్రయాణికుల బ్యాగులు, సామాన్లను జాగ్రత్తగా పరిశీలించడం రాకపోకలపై నిరంతర నిఘా ఉంచడం ప్రజలకు భద్రతాపరమైన సూచనలు ఇవ్వడంచేసారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రయాణికులకు సూచించారు.ఈ తనిఖీల ద్వారా నేరాలను ముందస్తుగా అడ్డుకోవడంతో పాటు, ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం మరింత పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. జిల్లాల్లో శాంతి భద్రతలు పటిష్టంగా కొనసాగేందుకు ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.