ప్రకాశం పోలీసు మరింత సమర్ధవంతగా విధులు నిర్వహించేలా కార్యాచరణ…
మహిళలు, పిల్లలు,వృద్దులు భద్రత పెంపొందించే దిశగా అడుగులు…
అసాంఘిక కార్యకలాలు, అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం…
జనవరి 2025 నుండి డిసెంబర్ 29 తేదీ వరకు క్షేత్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు జిల్లాకు మంచి సత్ఫలితాలు ఇచ్చాయి…
ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంతో సామాన్య ప్రజలకు చేరువై, దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలను వెంటనే పరిష్కరించాం.
స్టాప్ అండ్ వాష్ కార్యక్రమం, ఎన్ఫోర్స్మెంట్, రోడ్డు సేఫ్టీ వారియర్స్ తో వాహన చోదకులకు అవగాహన కల్పించి ప్రమాదాలు గణనీయంగా తగ్గించాం…
మహిళల రక్షణకు పెద్ద పేట వేస్తూ వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించేలా ఆదేశాలు జారీచేశాం…
డయల్ 112, శక్తీ యాప్ వ్యవస్థను పటిష్ట పరిచి ఆపద వచ్చిందంటే వెనువెంటనే సహాయం అందేలా కృషి చేశాం…
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
జిల్లాలోని పోలీసు అధికారులతో ఒంగోలు సమీపంలోని రైజ్ కాలేజీలో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, ఐఏయస్. గౌరవ 7వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్ట్ జడ్జి టి.రాజా వెంకటాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొలి శుభోదయం ప్రకాశం:-
2025 వ సంవత్సరానికి సంబంధించి జనవరి నుండి డిసెంబర్ నెల వరకు జిల్లావ్యాప్తంగా నమోదు కాబడిన దొంగతనాలు, దోపిడీ, ఆస్తి నేరాలు, చీటింగ్, పోక్సో, మహిళా సంబంధిత నేరాలు, మిస్సింగ్ కేసులు, ఎస్సి & ఎస్టి యాక్ట్ కేసులు, ఎన్డిపిఎస్ యాక్ట్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు, ఓపెన్ డ్రింకింగ్ వంటి మొదలగు కేసులపై జిల్లా ఎస్పీ గారు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ నేరాల నియంత్రణపై దృష్టి పెట్టడంతో పాటు కేసులను సత్వరం దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేసులలో ప్రజలకు సత్వరమే న్యాయం జరిగేలా సంబంధిత చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సమిష్టిగా పని చేయాలన్నారు. పైకి సివిల్ వివాదాలుగా కనిపిస్తున్నప్పటికీ నేరాలకు ఆస్కారం ఉన్న కేసులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు మరింత దృష్టి సారించి,భాదితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మాట్లాడుతూ నేరాల తీరును విశ్లేషించడం ద్వారా, నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరింత సమర్థవంతంగా పని చేస్తూ ముందడుగు వేయాలని సూచించారు. సాంకేతికత ఆధారిత పోలీసింగ్ తో జిల్లాలో నేరాలు గణనీయంగా కొంత వరకు తగ్గాయన్నారు. మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అదేవిధంగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయం మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఇతర శాఖల జిల్లా ఉన్నతాధికారులను సమన్వయ చేసుకుంటూ పని చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక కార్యచరణతో ప్రణాళికా బద్ధమైన చర్యలు తీసుకుంటూ, ప్రతి ఒక్క పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేసి, జిల్లాలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేలా కృషి చేయాలని తెలిపారు.2024సంవత్సరంలోని కేసులు నమోదు 2025 తో పోలిస్తే తక్కువ కేసులు నమోదు. శారీరిక నేరాలు, ప్రాపర్టీ నేరాలు, క్రైమ్ ఎగైనెస్ట్ వుమన్, రోడ్ ఆక్సిడెంట్, UI కేసులు 2024తో పోలిస్తే 2025 లో తక్కువ కేసులు నమోదు. డయల్ 112 వెంటనే స్పందించటం జరిగింది. సమీక్షా కాలంలో నేరాలు తగ్గగా, ప్రజలను సైబర్ నేరాల బారిన పడకుండా, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. జిల్లాలో గంజాయిపై నిఘా పెంచడం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు పోలీసింగ్ ను మరింత చేరువ చేసేందుకు ‘పల్లె నిద్ర’`కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. గ్రామస్థుల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయడం ద్వారా జరగబోయే నేరాలను జరగకుండా చూడవచ్చన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారులకు ఒంగోలు గౌరవ 7వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్ట్ జడ్జి టి. రాజా వెంకటాద్రి కొత్త చట్టాలు గురించి, సైబర్ నేరాలు, ప్రాపర్టీ నేరాలలో సాక్షాలను ఏ విధంగా సేకరించటం, రిలేటింగ్ టు ఇన్వెస్టిగేషన్ గురించి, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరణ గురించి, కేసును ఏవిధంగా నమోదు చేయాలి, నిందితులకు శిక్షలు పడేవిధంగా పలు విషయాలపై అవగాహనా కల్పించి వారికున్న సందేహాలను నివృత్తి చేసినారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడు గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.కీలక కేసులు త్వరితగతిన ఛేదించడం, ముఖ్యమైన కేసులలో శిక్షలు పడ్డటం, పెండింగులో ఉన్న కేసులను తగ్గించడం, వార్షిక ఫైరింగ్ లో ప్రతిభ కనపర్చిన, తదితర విధులలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, PP, APP లను, సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను, రివార్డ్స్ అందజేసిన జిల్లా ఎస్పీ అందచేశారు.ఈ నేర సమీక్ష సమావేశంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్,డిటిసి డిఎస్పీ జి.గురునాథబాబు, ఏఆర్ డిఎస్పీకె. శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై. ప్రశాంతి కుమారి, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ యం.అజయ్ కుమార్, కనిగిరి AJCJ కోర్ట్, APP, శ్రీ S.రఘునాధ రావు, ఒంగోలు ఎక్సైజ్ కోర్టు APP కె.శ్రావణ్ కుమార్, స్పెషల్ పిపి లు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, జిల్లాలోని అడిషనల్ పిపిలు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
