తొలి శుభోదయం :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు, ఒంగోలు తాలూకా సీఐ గారు, ట్రాఫిక్ సీఐ గారు, మరియు సింగరాయకొండ సీఐ గారు ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో బస్సుల్లో ఉన్న ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, గ్లాస్ బ్రేకర్లు, ఎమర్జెన్సీ డోర్లు, లగేజ్ కంపార్ట్‌మెంట్ భద్రత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రమాదాలను ముందుగానే నివారించేందుకు ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.