తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో రాత్రి గస్తీ (Night Beat) ను మరింత బలోపేతం చేశారు.రాత్రి సమయంలో శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా పోలీస్ బృందాలు ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాలు, బస్ స్టాండ్లు, మార్కెట్లు, కాలనీలు, ఇతర అంతర్గత రహదారుల్లో పహారా నిర్వహించారు.అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చెక్ చేశారు. రాత్రివేళ ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాలను పరిశీలించి, అట్టి చర్యలను అణచివేశారు. అదనంగా, నైట్ డ్యూటీ సిబ్బందికి అవసరమైన సూచనలు అందజేశారు.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రాధాన్యమని ఎస్పీ పేర్కొన్నారు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల రక్షణ కోసం 24 గంటలు అప్రమత్తంగా పనిచేస్తూ, నేరాలను అరికట్టడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.