తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజలతో నేరుగా మమేకమై గ్రామాల్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు గ్రామాల్లో రాత్రి సమయంలోనే నివసిస్తూ గ్రామస్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో భద్రతా పరిస్థితులు, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం, స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించి తక్షణ చర్యలు చేపడుతున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పోలీస్–ప్రజల మధ్య విశ్వాసం పెరిగి, గ్రామాల్లో నేరాల నివారణకు తోడ్పడుతుందని పోలీస్ అధికారులు తెలిపారు.