తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను మరింతగా కాపాడడంలో భాగంగా జిల్లా పోలీసులు ఫుట్ ప్యాట్రోలింగ్‌ను బలోపేతం చేశారు. పట్టణ ప్రాంతాలు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక లొకేషన్లలో పోలీసులు నడుచుకుంటూ గస్తీ నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న పుష్‌కార్ట్‌లను దుకాణాల ముందు నుండి తొలగించి, రహదారిని స్వేచ్ఛగా ప్రయాణించడానికి అనువుగా మార్చారు.అనుమానాస్పద వ్యక్తులను చెక్ చేయడం, వ్యాపార ప్రాంతాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, ప్రజల్లో భద్రతాభావం కల్పించడం లక్ష్యంగా ఫుట్ ప్యాట్రోలింగ్‌ను పోలీసులు నిరంతరం కొనసాగిస్తున్నారు.ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసులు, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు.