తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 130 ఫిర్యాదులు
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీ కోసం) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల యొక్క వ్రాతపూర్వక వినతులను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. అందిన ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారిలో కొంత మంది వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండేవారు ఫిర్యాదు చేయడానికి వస్తూ ఉంటారని, అలా వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని సత్వర న్యాయం అందిస్తామని భరోసా వారిలో కలిగించాలని, సంఘటన ప్రదేశాన్ని సందర్శించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్/భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు,ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు, చీటింగ్ మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు రూరల్ సీఐ యన్.శ్రీకాంత్ బాబు, పొదిలి సీఐ యం.రాజేష్ కుమార్,గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, పామూరు సీఐ యం.శ్రీనివాసరావు సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
