తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్క ఇంటికి క్లోరినేషన్ నీటిని అందించాలన్నదే లక్ష్యంగా గ్రామపంచాయతీ ముందుకు వెళుతుందని సర్పంచ్ తాటిపర్తి వనజ అన్నారు. ఈ సందర్భంగా సింగరాయకొండ గ్రామపంచాయతీ యొక్క వాటర్ స్కీం ను పరిశీలించారు. ఇటీవల నీటిని క్లోరినేషన్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఉపయోగించి నీటిని పరిశుభ్రపరుస్తున్నామని ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు తెలియపరిచారు. ప్రతిరోజు నీటిని క్లోరినేషన్ చేసి గ్రామానికి పంపిణీ చేయాలని సిబ్బందికి సర్పంచ్ వనజ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓలేటి రవిశంకర్ రెడ్డి మరియు డిప్యూటీ ఎంపీడీవో ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు గారు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *