తొలి శుభోదయం :-
ప్రతీకా రావల్ కు గాయం.. సెమీస్ కు ముందే టీమిండియాకు పెద్ద షాక్
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెమీ ఫైనల్స్ కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ గ్రూప్ స్టేజి మ్యాచ్ లో ఫీలింగ్ చేస్తున్నప్పుడు కాలు మడత పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె మడమ, మోకాలికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 30న ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీ ఫైనల్ 2లో ఆమె అందుబాటులో ఉండటం కష్టమని భావిస్తున్నారు. టోర్నమెంట్ లో ఇప్పటివరకు ప్రతీకా రావల్ 6 మ్యాచ్ లలో 308 పరుగులు చేశారు.