తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.రోడ్డు భద్రతా నిబంధనలను అతిక్రమిస్తూ, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహన చోదకులపై ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, ఓవర్ లోడ్‌తో ఉన్న వాహనాలను నిలిపివేసి డ్రైవర్లకు మరియు ప్రయాణికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అతిగా ప్రయాణికులను ఎక్కించడం వల్ల వాహనం టైర్లు పేలడం లేదా బ్యాలెన్స్ తప్పి బోల్తా పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణాలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.