తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా కందుకూరు గ్రామంలో డివిజనల్ డిఎం అండ్ హెచ్ ఓ గారిని కలిసి ప్రైవేటు ఆసుపత్రుల నందు ఫీజుల పట్టిక అనగా బ్లడ్ టెస్ట్ లు స్కానింగ్లు ఎక్స్రే లకు సంబంధించి ఫీజులు పట్టిక లేనందువలన ప్రైవేటు ఆసుపత్రుల వాళ్లు ఇష్టానుసారంగా ఫీజులు అధికముగా వసూలు చేయుచున్నారని మరియు రూము రెంటులు కూడా ఎక్కువగా వసూలు చేయుచున్నారని ప్రభుత్వము నిర్ణయించిన రేట్ల ప్రకారం ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి నందు పట్టిక రేట్లు పెట్టవలసిందిగా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ని కందుకూరు డివిజన్ ఎంఆర్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ కమిటీ వాళ్లు అందరూ వెళ్లి అడగటం జరిగినది. డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ గారిని ప్రతి ప్రైవేటు ఆసుపత్రి మీరు స్వయంగా వెళ్లి సందర్శించి ప్రతి హాస్పటల్ నందు గవర్నమెంట్ నిర్ణయించిన ధరల పట్టికను ఉండేటట్టు మాట్లాడవలసినదిగా మేడమ్ గారిని కోరడం జరిగినది. ప్రైవేటు ఆసుపత్రిలో వాళ్లు వాళ్ల ఇష్టానుసారంగా స్కానింగ్ టెస్ట్ లు ఎక్కువ రేటు వసూలు చేయుచున్నారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ ప్రెసిడెంట్ ఎస్టీ గౌస్ బాషా వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం సెక్రటరీ నరేంద్ర ఉమెన్స్ వింగ్ కన్వీనర్ పి మాధవి ఉమెన్స్ వింగ్ సెక్రటరీ అయినా షేక్ మౌలా బి మరియు ఉలవపాడు మండల ప్రెసిడెంట్ కృష్ణ కృష్ణ అందరూ కలిసి మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగినది.