తొలి శుభోదయం కనిగిరి:-

కనిగిరి పట్టణం లో తహసీల్దార్ గారికి విఆర్ఏ లు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీసీ కేశవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ తో 21—11— 2025 తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.కార్మికుల ప్రయోజనాలకు ఈ లేబర్ కోడ్స్ విగాథం కలిగించి పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చుతాయి.కార్మికులు బేరసారాలాడే శక్తిని నిర్వీర్యం చేయడం, యూనియన్లు పెట్టుకునే హక్కును, సమ్మెహక్కును నిరాకరిస్తాయి. పని గంటల పెంపు,మహిళలతో రాత్రి షిఫ్ట్ లందు పనిచేయాలని విధానాలు కార్మికుల పోరాడి సాధించుకున్న చట్టబద్ధమైన హక్కులను నిరాకరిస్తున్నాయి. కోట్లాదిమంది కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ మన రాష్ట్రంలో ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బలపరచడమే గాక పని గంటలు 8 నుండి 13 కు పొడిగించింది భద్రత లేకపోయినా మహిళలతో రాత్రిపూట షిఫ్ట్ లందు పనిచేయుచుటకు సిద్ధమైంది. వీఆర్ఏలకు గత పదేళ్లుగా జీతాలు పెరగలేదు మన పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ జీతాలు అమలు చేస్తున్నారు మన రాష్ట్రంలో కేవలం 11000 మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు ఈ జీతంతో కుటుంబాలు గడవక విఆర్ఏలు అప్పుల పాలవుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే నిబంధనలకు విరుద్ధంగా నైట్ డ్యూటీలు వేశారు కానీ టీఏ డీఏ ల కింద ఒక పైసా కూడా ఇవ్వడం లేదు దశాబ్దాలు తరబడి పనిచేస్తున్న నామినిలుగా వీఆర్ఏలుగా గుర్తించడం లేదు వీఆర్వో, అటెండర్,వాచ్మెన్,రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ ఖాళీ పోస్టులలో 70% వీఆర్ఏలకు కేటాయించాలి.అర్హులైన వారితో ఖాళీలను భర్తీ చేయాలి డీఏ ను జీవితంలో కలపాలి తదితర డిమాండ్లకు పరిష్కారం కోసం ఫిబ్రవరి 12 వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో వీఆర్ఏలు పాల్గొని జయప్రదం చెయ్యాలని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ మండల కన్వీనర్ పి నరేంద్ర వీఆర్ఏ యూనియన్ నాయకులు దేవదానం, ఏడుకొండలు, రోమో, ముసలయ్య, భారహిమామ్, సుబ్బులు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *