తొలి శుభోదయం టంగుటూరు:-
టంగుటూరు మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 19 సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ గ్రామపంచాయతీ స్థాయిలో సుస్థిర శాశ్వత వనరులు ఏర్పాటు గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నాం ఉపాధి హామీ పథకం దేశంలో ఆంధ్ర ప్రదేశ్ ను మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల కృషి కీలకమైనది ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇస్తున్న వేతనం నెలకు 5745 రూపాయలు తో కుటుంబాలు బ్రతకడం కష్టంగా మారింది మా కుటుంబాలను పస్తుల నుండి కాపాడేందుకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు తీరుతాయని ఫీల్డ్ అసిస్టెంట్లు భావించారు కానీ గత ప్రభుత్వంలో జరిగినట్లుగానే గత ఏడాది కాలంలో ఫీల్డ్ అసిస్టెంట్ లో అక్రమ తొలగింపులు, పెద్ద ఎత్తున జరిగాయి ఇలాంటి ఒత్తిడి వలన ఫీల్డ్ అసిస్టెంట్ లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హత్యలకు గురవుతున్నారు అనేక చోట్ల బలవంతపు రాజీనామాలు చేయించుకున్నారు దీనితో ఫీల్డ్ అసిస్టెంట్లు నిత్యం అభద్రతతో బ్రతుకులీడుస్తున్నారు కావున ఫీల్డ్ అసిస్టెంట్లు పై రాజకీయ వేధింపులు అరికట్టి ఉద్యోగ భద్రత కల్పించాలని మనవి చేస్తున్నాము ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న ఈ క్రింది పేర్కొన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి మా కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుచున్నాము ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలియజేస్తున్నాం ఇప్పటికైనా తమరు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము మ్యాన్డేస్ విధానం రద్దు చేయాలి మండల స్థాయిలో బదిలీల సౌకర్యం కల్పించాలి ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలి అర్హత అనుభవం కలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలి
ఈ కార్యక్రమంలో టంగుటూరు మండల ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ అధ్యక్షుడు నంబూరి శ్రీకాంత్ మరియు ఉపాధ్యక్షులు కరవాది పవన్ మరియు ఎఫ్ఏ లు పాటిబండ్ల జాన్ బాబు .అద్దంకి వెంకట్రావు .దార్ల హర్ష. పొంతగాని వెంకట్రావు. వల్లూరు రత్తమ్మ. కసుకుర్తి శ్రావణి పొనుగోటి మహేష్ . సిఐటియు నాయకులు మోజెస్ పాల్గొన్నారు