తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామంలో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీ తాటికొండ సింహాద్రి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ పట్ల తమ అంకితభావాన్ని తెలియజేశారు.తెలుగుదేశం పార్టీ స్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాము.