తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మార్గదర్శకత్వంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చేపడుతున్న జనసేవ – ప్రజలకు చేరువ కార్యక్రమంలో భాగంగా, ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాస్ రావు ఒంగోలు తాలూకా పీఎస్ లిమిట్స్‌లోని బలరాం కాలనీ పరిసరాల్లో ఫుట్ వాక్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలోని నివాసితులతో మాట్లాడి వారి రోజువారీ సమస్యలు, భద్రతా అంశాలు, వీధి లైట్లు, మద్యం/గంజాయి దుర్వినియోగం, రోడ్డుపై వెలుతురు, డ్రైనేజ్ సమస్యలు, యూత్ పై పర్యవేక్షణ వంటి విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ఫుట్ వాక్ ద్వారా ప్రజలకు చేరువ
డిఎస్పి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి, పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువ కావడమే తమ లక్ష్యం అని తెలిపారు. చట్టం–క్రమశిక్షణపై నమ్మకం పెంపు
ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న పెద్ద సమస్యలను వివరంగా విని, వెంటనే పరిష్కారం కావాల్సిన అంశాలపై సంబంధిత విభాగాలకు సూచనలు ఇచ్చారు.ప్రజల సహకారమే పోలీసుల బలం
సమాజంలోని యువత చట్టబద్ధంగా నడవడం, డ్రగ్స్ & మద్యం దుర్వినియోగం నివారించేందుకు ప్రజలు పోలీసులతో కలిసి పనిచేయాలని కోరారు.పోలీస్ స్టేషన్ సిబ్బందిఈ కార్యక్రమంలో తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *