తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వ్యక్తులపై ప్రత్యేక దాడులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని, వారిపై కేసులు నమోదు చేశారు. ప్రజా ప్రదేశాలలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అసలు సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.అదేవిధంగా, మద్యం సేవన వల్ల అపరిశుభ్రంగా మారిన ప్రదేశాలను శుభ్రపరుస్తూ, పరిశుభ్రత కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రజలు ఉపయోగించే ప్రదేశాలను శుభ్రముగా, సురక్షితంగా ఉంచేందుకు పోలీసులు ముందుండి పరిశుభ్రతలో భాగస్వామ్యం కావడం ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు.ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు, పహారాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
