తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు
ప్రజల శాంతి భద్రతలు, సామాజిక ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతను పరిరక్షించే దిశగా మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యం సేవన కేంద్రాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో అక్రమంగా బహిరంగ మద్యం సేవిస్తున్న ప్రదేశాలను గుర్తించి పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో SI గారి ఆధ్వర్యంలో బహిరంగ బూజింగ్ ప్రదేశాలను తొలగించి, అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేశారు.అదేవిధంగా వై.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో SI గారి నేతృత్వంలో బహిరంగ మద్యం సేవన ప్రాంతాలపై చర్యలు తీసుకుని ప్రజలకు చట్టపరమైన హెచ్చరికలు జారీ చేశారు.
గిద్దలూరు పట్టణంలో బహిరంగ మద్యం సేవనంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటిని పూర్తిగా శుభ్రం చేసి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు.ముఖ్యంగా నాయుడుపల్లి గ్రామంలో మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ SI గారి ఆధ్వర్యంలో, పంచాయతీ సిబ్బంది మరియు స్థానిక ప్రజల సహకారంతో బహిరంగ మద్యం సేవన కేంద్రాలను తొలగించారు. ఈ సందర్భంగా మద్యం వల్ల కలిగే సామాజిక దుష్పరిణామాలు, కుటుంబ సమస్యలు, శాంతి భద్రతలపై ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.అలాగే గణపవరం గ్రామ రోడ్డులో, త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో SI ఆధ్వర్యంలో బహిరంగ మద్యం సేవన ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేసి, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.మార్కాపురం జిల్లా పోలీసులు భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తూ, మద్యం రహిత, శాంతియుత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి తమ పరిసరాల్లో బహిరంగ మద్యం సేవనం కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.