తొలి శుభోదయం ప్రకాశం:-

బల్లికురవ పోలీసులు చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల పరిధిలో రైతుల రోటవేటర్లు, ట్రాక్టర్ ట్రాలీలను దొంగిలించిన నలుగురు ముద్దాయిలను బల్లికురవ ఎస్సై చెన్నుపల్లి శివారులో అరెస్టు చేశారు.సుమారు 8 లక్షల రూపాయల విలువైన ఐదు రోటవేటర్లు, ఒక ట్రాక్టర్ ట్రాలీని స్వాధీనపరచుకున్నారు.

అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు:
1.అంకం శెట్టి బాలాంజనేయులు, తండ్రి: హనుమంతరావు, వయస్సు: 27 సంవత్సరాలు, గోకనకొండ గ్రామం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా.
2.వల్లెం నాగరాజు, తండ్రి: చెన్నకేశవులు, వయస్సు: 23 సంవత్సరాలు, గోకనకొండ గ్రామం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా.
3.కొండి వెంకటేశు, తండ్రి: శ్రీనివాసరావు, వయస్సు: 24 సంవత్సరాలు, గోకనకొండ గ్రామం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా.
4.దిద్దుల అంకమ్మరావు, తండ్రి: వెంకటరావు, వయస్సు: 19 సంవత్సరాలు, గోకనకొండ గ్రామం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా.చేదించిన కేసులు మరియు రికవరీ వివరాలు:
బల్లికురవ మండల పరిధిలో నమోదైన 3 కేసుల్లో ఒక ట్రాక్టర్ ట్రాలీ మరియు రెండు రోటవేటర్లు,మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో ఒక రోటవేటర్, అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో ఒక రోటవేటర్, సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో ఒక రోటవేటర్ మొత్తం 6 కేసుల్లో ఒక ట్రాక్టర్ ట్రాలీ మరియు ఐదు రోటవేటర్లు (సుమారు 8 లక్షల రూపాయల విలువ) రికవరీ చేయబడ్డాయి.ముద్దాయిల నేపథ్యం మరియు చోరీ విధానం: ఈ నలుగురు ముద్దాయిలు పల్నాడు జిల్లా, వినుకొండ మండలం, గోకనకొండ గ్రామానికి చెందినవారు. వృత్తిరీత్యా ఇసుక ట్రాక్టర్లకు డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనోపాధి సంపాదిస్తున్నారు. అయితే, చెడు వ్యసనాలకు బానిసలైన వీరు, తమ పని నుండి సరిపడా ఆదాయం రాకపోవడంతో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. గత మూడు నెలలుగా రాత్రి సమయాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ, రైతుల రోటవేటర్లు, ట్రాక్టర్ ట్రాలీలను దొంగిలించి, వాటిని అమ్ముకుని తమ చెడు వ్యసనాలను తీర్చుకునేందుకు ఈ దొంగతనాలను అలవాటు చేసుకున్నారు.ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు దర్శి DSP శ్రీ.బి.లక్ష్మినారాయణ గారి పర్యవేక్షణలో సంతమాగులూరు సిఐ కె,వెంకటరావు, బల్లికురవ SI వై.నాగరాజు మరియు వారి సిబ్బంది అన్ని కోణాలలో దర్యాప్తు చేసి మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులోనే సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *