తొలి శుభోదయం ప్రకాశం :-

బాలల దినోత్సవం సందర్భంగా, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు.జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, పిల్లలలో భద్రతా అవగాహన పెంపొందించేందుకు, పోలీస్‌-పబ్లిక్ మధ్య నమ్మకం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులతో మాట్లాడుతూ— చదువుతో పాటు క్రమశిక్షణ, నైతికత, లక్ష్యసాధన ఎంత ముఖ్యమో వివరించారు. పిల్లల సందేహాలు, భవిష్యత్ లక్ష్యాలు, ఆసక్తులు వంటి విషయాలను ఆత్మీయంగా విన్నారు.పాఠశాలలో, ఇంట్లో, రోడ్డు మీద భద్రత గురించి చిన్న చిన్న సలహాలు ఇచ్చారు.పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ, చిన్న కానుకల రూపంలో నోట్స్‌బుక్స్, పెన్లు, పెన్సిల్స్, స్వీట్లు పంపిణీ చేశారు.“మీకు ఏ సమస్య వచ్చినా 100/112 కు కాల్ చేయండి – పోలీస్ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది” అని విద్యార్థులకు అధికారులు చెప్పారు.బాలల దినోత్సవాన్ని పోలీస్ సిబ్బంది పిల్లలతో కలిసి పండుగలా జరుపుకున్నారు.జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, స్టేషన్ స్టాఫ్, బీట్ సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని పిల్లల ముఖాల్లో చిరునవ్వులు పూయించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *