తొలి శుభోదయం సింగరాయకొండ:-

అనుమల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా తన మిత్రులు గురువారం సింగరాయకొండ మండలం, బింగినపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో చదువుచూ నాలుగో తరగతి నుండి ఐదవ తరగతికి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థినిలకు స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.అదే పాఠశాలలో చదువుతున్న మిగతా విద్యార్థులకు కూడా నోట్ బుక్స్‌ను అందజేశారు.ఈ సందర్భంగా మిత్రబృందం మాట్లాడుచు తమ బాల్య మిత్రుడు అనుమల చంద్రశేఖర్ విద్యపై ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వ్యక్తి అని,ఆయన జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.అదేవిధంగా గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే పిల్లలు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామని,ఈ కార్యక్రమం ఆరంభం మాత్రమే ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమములో పాల్గొన్న న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుచు తమతో లేని మిత్రుని స్మరించుకుంటూ యువత ఈ విధంగా బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించటం అభినందనీయమన్నారు.బాలల భవిష్యత్తును మార్చే శక్తి విద్యకే ఉందని,గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పోటీ తత్వాన్ని అలవర్చుకుంటారని,ఈ స్టడీ మెటీరియల్ వారి లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు.తమ మధ్య లేని అనుముల చంద్రశేఖర్ ఆశయాలను ఇలానే కొనసాగించాలని మిత్రులను కోరారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, విద్యార్థులు విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుతారన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యారంగానికి తోడ్పడే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మిత్రులు కూనపు విజయ్ కుమార్,జి అశోక్ చక్రవర్తి,మహమ్మద్ హమీద్,అనుముల జగదీష్,అనుమల రుద్రమూర్తి
విజయ్ బాదురే, రవి కుమార్ మరియు ఉపాధ్యాయులు నక్కా మాలీరావు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *