తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా బాలోత్సవం పోటీలలో సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు ఫస్ట్,సెకండ్, థర్డ్ స్థానాలలో విజయం సాధించారు. నిర్వాహకులు వీరికి సర్టిఫికెట్ తో పాటు మెమొంటోను ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఒంగోలులో బహుకరించారు. సోమవారం నాడు శ్రీవిద్యానికేతన్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు వీరికి అభినందనలు తెలియజేశారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వక్ర్తుత్వ పోటీల విభాగంలో ఫస్ట్ ప్లేస్ షేక్ మాహియా, డ్రాయింగ్ జూనియర్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ లోకేష్, ఎస్సే రైటింగ్ విభాగంలో ఉర్దూలో ఫస్ట్ ప్లేస్, షేక్ సుమియా, అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ లో ఫస్ట్ ప్లేస్ టీ. లితిక్, ఎలక్యూషన్ విభాగంలో తెలుగు మీడియం లో సెకండ్ ప్లేస్ జి మమత, ఎలక్యూషన్ ఇంగ్లీష్ మీడియం విభాగంలో సెకండ్ ప్లేస్ ఏవి భార్గవి, విచిత్ర వేషధారణలో సెకండ్ ప్లేస్ షేక్ జాకీయా, ఏకపాత్రాభినయం పోటీలలో థర్డ్ ప్లేస్ బి.యామిని, ఫోక్ డాన్స్ లో జూనియర్ విభాగంలో థర్డ్ ప్లేస్ సాధించారని మొత్తంగా పదిమంది విద్యార్థులు విన్నర్స్ గా నిలిచారని తెలిపారు. హైస్కూల్ హెడ్మాస్టర్ సైకం శ్రీవిద్య మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థిని,విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.
