తొలి శుభోదయం కందుకూరు:-
తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితులైన బీద రవిచంద్ర ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నెల్లూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా, రవిచంద్ర ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ని కూడా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.