తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరులో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాడి శ్వేత మాట్లాడుతూ, సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేతగా పూలే చిరస్మరణీయుడని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పూలే గారి సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, విద్యా ప్రాధాన్యత కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.