తొలి శుభోదయం ప్రకాశం:-
మార్కాపురం జిల్లా పోలీస్ పరిధిలోని దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22 క్వార్టర్ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు.అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దిశగా ఇటువంటి దాడులు కొనసాగుతాయని తెలిపారు.