తొలి శుభోదయం :-
ప్రకాశంజిల్లా బేస్తవారిపేట మండలంలో ఉన్న ZPHS గర్ల్స్ స్కూల్ విద్యార్థినీలు సోమవారం ఉదయం బేస్తవారిపేట బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
విద్యార్థినీలు తెలిపిన వివరాల ప్రకారం, గిద్దలూరు డిపోకు చెందిన గొల్లపల్లి రూట్ బస్సు సమయానికి రాకపోవడం, అలాగే తరచూ ఆలస్యంగా రావడం వల్ల పాఠశాలకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
విద్యార్థినీలు మాట్లాడుతూ—
బస్సు సమయానికి రాకపోవడం వల్ల ప్రతిరోజూ పాఠశాలకు ఆలస్యమవుతోందని, రోడ్డుపై ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందని,భద్రతా సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థినీల సమస్యలను తెలుసుకున్న స్థానికులు, తల్లిదండ్రులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని వెంటనే బస్సు సర్వీసులు సక్రమంగా నడపాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు.ధర్నా కారణంగా కొద్ది సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థినీలను నచ్చజెప్పి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం విద్యార్థినీలు ధర్నా విరమించారు.