తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అష్రఫుల్లాఖాన్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రహీం మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్రం కోసం అనేకమంది ప్రాణాలను పణంగా పెట్టారు అందరూ సమైక్యంగా బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, ముస్లింలు ఈ భారతదేశాన్ని వెయ్యి సంవత్సరాలకు పైగా పరిపాలించారు,ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలను అర్పించిన వారిలో 60 శాతం మంది ముస్లింలు ఉన్నారు అని కొనియాడారు 1920 అక్టోబర్ 22న జన్మించిన అష్రఫుల్ల ఖాన్ కేవలం 27 సంవత్సరాలకే ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడు, అదేవిధంగా బ్రతికున్నంత కాలం పేద ప్రజల కోసం ఆలోచించాడు దేశం కోసం,దేశ విముక్తి కోసం శ్రమించిన గొప్ప మేధావి,కవి అష్రఫుల్ల ఖాన్, నేను చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు మరెన్నో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది నా దేశం స్వేచ్ఛ వాయువులు హాయిగా పిలుస్తుంది, నా దేశ ముస్లింలలో ఉరికంబాన్ని ఎక్కిన్న మొట్టమొదటి ముస్లింగా అదృష్టవంతుడిగా అని ఉరితాడును మెడలో తానే వేసుకున్న ఉద్యమకారుడు