తొలి శుభోదయం కందుకూరు:-
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి ని కలిసి తన కుటుంబ సభ్యులను ఆయనకు పరిచయం చేశారు. కందుకూరు నియోజవర్గంలో దేవాలయాల అభివృద్ధిపై ఆనం రామనారాయణ రెడ్డి తో చర్చించారు. కొత్తగా నిర్మించాల్సిన దేవాలయాల ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడే ఉన్న తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరిచయం చేసుకుని మాట్లాడారు.