మద్యం తాగి వాహనం నడిపిన ఎనిమిది మందికి గిద్దలూరు గౌరవ కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది.
తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పొలీసు స్టేషన్ ల పరిధిలో బ్రీతింగ్ ఎనలైజర్‌తో పరీక్షలు చేసి డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినారు. డ్రంకన్ డ్రైవింగ్ టెస్ట్ లలో పట్టుబడిన వారిని గౌరవ కోర్ట్ వారి ముందు హాజరు పరచగా, వారికి గౌరవ న్యాయస్థానం వారు జైలు శిక్ష మరియు జరిమానా విధించారు.ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఆరుగురు వ్యక్తులను శుక్రవారం గిద్దలూరు కోర్టులో ప్రవేశపెట్టగా గిద్దలూరు అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి శ్రీ భరత్ చంద్ర గారు ఇద్దరు వ్యక్తులకు 100 రోజుల జైలు శిక్షతో పాటు రూ.15,000 జరిమానా, ఒకరికి 60 రోజుల జైలు శిక్షతో రూ.10,000 జరిమానా, మరో వ్యక్తికి 19 రోజుల జైలు శిక్షతో రూ.10,000 జరిమానా, ఇంకా మరొకరికి 17 రోజుల జైలు శిక్షతో రూ.15,000 జరిమానా విధించారు.అదేవిధంగా బీవీ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులకు (ఒక్కొక్కరికి) 22 రోజులు జైలు శిక్ష మరియు 10,000 జరిమానా విధించారు మద్యం తాగినప్పుడు వాహనాలు నడపవద్దని, వాహనదారులు తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని, ప్రమాదాలకు గురికావద్దని, ఇతరులను ప్రమాదంలో పడేయవద్దని జిల్లా పోలీసులు ప్రజలను కోరారు.ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
