తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

రానున్న మహాశివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మహాశివరాత్రి పండుగను భక్తులు అత్యంత వైభవంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడాలన్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. జిల్లాల్లోని ప్రముఖ శివాలయాలను పోలీస్ అధికారులు సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.ఆలయ కమిటీ సభ్యులతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమై, ఉత్సవాల నిర్వహణ మరియు భక్తుల రద్దీని ఎలా క్రమబద్ధీకరించాలో చర్చించారు.తొక్కిసలాటలు జరగకుండా క్యూలైన్ల నిర్వహణ, బారికేడ్ల ఏర్పాటు, రాత్రి సమయాల్లో వెలుతురు (Lighting) ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఉత్సవాల సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సిసిటివి నిఘా, డ్రోన్ కెమెరాల వినియోగం మరియు మఫ్టీ పోలీసుల పహారా ఉంటుందని స్పష్టం చేశారు.రథోత్సవాలు, వాహన సేవలు మరియు భక్తుల స్నాన ఘట్టాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *