తొలి శుభోదయం ప్రకాశం:-
మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన పెంపొందించి సురక్షిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, వై.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని వై.పాలెం సీఐ నాయకత్వంలో, వై.పాలెం పీఎస్ ఎస్ఐ సమన్వయంతో నిర్వహించగా, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణకు కుటుంబం, పాఠశాల, సమాజం అందరూ బాధ్యత వహించాలని తెలిపారు. ఈవ్ టీజింగ్, బాలలపై దుర్వినియోగం, సైబర్ నేరాలు వంటి అంశాలపై జాగ్రత్తలు వివరించి, ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.డయల్ 112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మహిళల భద్రతకు సంబంధించిన పోలీస్ సేవల గురించి వివరించి, సమస్యలను భయపడకుండా తెలియజేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లలపై నిరంతర పర్యవేక్షణ, మంచి–చెడుల మధ్య తేడా తెలియజేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.