తొలి శుభోదయం టంగుటూరు:-

టంగుటూరు ఎస్సై వి. నాగమల్లేశ్వరరావు గారు మరియు వెలుగు APM బుర్రా సుబ్బారావు మరియు ఆఫీసు సిబ్బంది ఆధ్వర్యంలో టంగుటూరులోని వెలుగు ఆఫీసు నందు సిబ్బందికి సైబర్ క్రైమ్, మహిళలు మరియు విద్యార్థులపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాలు మరియు మాదకద్రవ్యాలు వాడకంపై, నూతనంగా ఏర్పడిన చట్టాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.
నూతన చట్టాలపై అవగాహన
ప్రతి ఒక్కరూ నూతనంగా ఏర్పడిన చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలి
అదేవిధంగా నూతన చట్టాల ద్వారా బాధితులుకు కల్పించబడిన వెసులుబాటు, నేరములకు సంబంధించిన శిక్షలు గురించి అవగాహన కలిగి ఉండి తోటి వ్యక్తులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలి.సైబర్ క్రైమ్స్ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్త పాటించడం ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అకౌంట్ లకు వచ్చే అనుమానిత లింక్స్, మెసేజ్లు పట్ల జాగ్రత్త వహించడం బ్యాంక్ సిబ్బంది అని చెప్పి ఫోన్ చేసి ఓటీపీలు అడిగే వారిపట్ల జాగ్రత్త వహించాలి అనుమానిత వ్యక్తులకు ఫోన్లు మరియు ఏటీఎం కార్డులు ఇవ్వకుడదు పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి, మీపై కేసులు ఉన్నాయని చెప్పి వచ్చే ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలి. మహిళలు మరియు విద్యార్థులపై జరుగుతున్న నేరాలపై పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు మహిళలపై ,విద్యార్థులపై జరిగే నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అపరిచిత వ్యక్తుల వల్ల బాధపడుతున్న బాధితులు ధైర్యంగా జరిగిన విషయం గురించి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయవలెను మహిళలు మరియు విద్యార్థులు బయటకు పని మీద వచ్చినపుడు అపరిచిత వ్యక్తుల వాహనాలు ఎక్కటం గాని వారితో సెల్ఫీ లు దిగటం వంటి వాటికీ దూరంగా ఉండాలి మహిళలు మరియు విద్యార్థులు పనిమీద బయటకు వచ్చిన సమయంలో వారి యొక్క సమాచారంను ఇంట్లోని వ్యక్తులకు తెలియపరచవలెను.రోడ్డు ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి ఉండాలి ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చేయకూడదు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి వాటి గురించి అవగాహన కలిగి ఉండాలి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *