న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ, శ్రీంప్ సినర్జీ ప్రాజెక్ట్లో భాగంగా కోస్తా తీరంలోని రొయ్యల అమ్మకాలు, ప్రాసెసింగ్ యూనిట్ లలో పనిచేస్తున్న మహిళలకు అవసరాలపై నిర్వహించిన నీడ్ అసెస్మెంట్ కార్యక్రమంలో భాగంగా, సింగరాయకొండ మండలం పరిధిలోని పాకల పల్లెపాలెం గ్రామానికి చెందిన 18 మంది మహిళా కార్మికులను గుర్తించి, వారికి ఉపయోగపడే రూ.50,000/- విలువైన వేటకు వెళ్లే వల తాళ్లు, రొయ్యల మోతకు ఉపయోగపడే గిన్నెలు,మందులు తదితర సామగ్రిని అందజేశారు.ముఖ్య అతిథి రమేష్ మాట్లాడుతూ కోస్తా తీర ప్రాంతాల్లో రొయ్యల ఫ్యాక్టరీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళా కార్మికుల అవసరాలను గుర్తించి, వారికి నేరుగా ఉపయోగపడే వస్తువులను అందించడం అభినందనీయం. సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీంప్ సినర్జీ ప్రాజెక్ట్ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తే మహిళా కార్మికుల సంక్షేమం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళల జీవనోపాధి కేవలం ఉపాధితోనే కాకుండా వారి హక్కులు, భద్రత, గౌరవంతో కూడిన పని పరిస్థితులు ఉన్నప్పుడే స్థిరంగా ఉంటుంది. రొయ్యల ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళా కార్మికులకు అవసరమైన వనరులు అందించడం ద్వారా వారి కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు మహిళలను ఆత్మనిర్భరులుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ సుబ్బారావు, సార్డ్స్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
