తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

మహిళల భద్రత, రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్ మరియు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, మార్కెట్ ప్రాంతాలు, విద్యాసంస్థలు, గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు శక్తి యాప్ ఉపయోగంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా పోలీసుల సహాయం ఎలా పొందవచ్చో ప్రాయోగికంగా వివరించారు.పోలీసు అధికారులు మాట్లాడుతూ, శక్తి యాప్ ద్వారా ఎస్‌ఓఎస్ అలర్ట్ పంపడం, ప్రత్యక్షంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేయడం, లొకేషన్ ట్రాకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.మహిళలు, విద్యార్థినులు, పని చేసే మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ దైనందిన జీవితాన్ని సాగించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, భద్రతను మరింత బలోపేతం చేయేందుకు శక్తి యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, శక్తి యాప్ ప్రచారం నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *