తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు
మహిళల భద్రత, అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో శక్తి యాప్పై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
దర్శి పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయం పరిసరాల్లో దర్శి శక్తి టీమ్, దర్శి SD ఆధ్వర్యంలో శక్తి యాప్ డౌన్‌లోడ్ & అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మహిళలకు శక్తి యాప్ ఉపయోగం, SOS ఫీచర్, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు వెంటనే సమాచారం చేరే విధానం గురించి వివరించారు.అలాగే ఒంగోలు HQ – శక్తి టీమ్–II ఆధ్వర్యంలో శక్తి యాప్ డౌన్‌లోడ్ & అవగాహన కార్యక్రమం నిర్వహించి, ప్రజలకు యాప్ ఇన్‌స్టాలేషన్ చేయించి, దాని ప్రయోజనాలను వివరించారు.కంభం పట్టణంలోని చౌక్ సెంటర్ మరియు RTC బస్‌స్టాండ్ సెంటర్లలో శక్తి యాప్ డౌన్‌లోడింగ్‌తో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. మహిళలు, విద్యార్థులు, ప్రయాణికులకు యాప్ ఉపయోగం, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.అదేవిధంగా ఒంగోలు RTC బస్‌స్టాండ్ వద్ద HQ టీమ్–1 ఆధ్వర్యంలో శక్తి యాప్ డౌన్‌లోడ్ & అవగాహన కార్యక్రమం నిర్వహించి, ఎక్కువ సంఖ్యలో మహిళలు యాప్‌ను తమ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకునేలా చేశారు.మరింతగా దర్శి బస్‌స్టాండ్ సెంటర్లో దర్శి శక్తి టీమ్ ద్వారా శక్తి యాప్ అవగాహన మరియు ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రతి మహిళ శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని, తమ భద్రతను తామే మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.ప్రజలు పోలీసులకు సహకరించి, మహిళల భద్రతకు శక్తి యాప్‌ను విస్తృతంగా వినియోగించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *