తొలి శుభోదయం న్యూస్ :-
గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి జన్మదినం సందర్భంగా, ఒంగోలులోని భాగ్యనగర్ 2వ లైన్ వద్ద ఉన్న ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి – సింగరాయకొండ మండలం ఆధ్వర్యంలో దివ్యాంగ సోదరులు, సోదరీమణులు పాల్గొని, శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.తరువాత దివ్యాంగులు తమ సమస్యలను వివరించగా, మాగుంట గారు వెంటనే తన సిబ్బందిని పిలిపించి సమస్యలను సమగ్రంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.