తొలి శుభోదయం ప్రకాశం:-
దర్శి లో విషాదం – రెండేళ్ల బిడ్డతో సాగర్ కెనాల్లో దూకిన మహిళ… ఎస్సై మురళి తక్షణ స్పందనతో రక్షణ చర్యలు వేగవంతం
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో జరిగిన ఒక హృదయ విదారక ఘటనపై పోలీసు సిబ్బంది అత్యంత వేగంగా స్పందించారు. చిన్నారితో కలిసి స్థానికంగా ఉన్న సాగర్ కెనాల్ లోకి దూకిన ఒక మహిళను రక్షించేందుకు పోలీసులు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు.సమాచారం అందుకున్న వెంటనే దర్శి ఎస్సై మురళి , స్థానికుల సహకారంతో ఘటన స్థలానికి చేరుకుని శీఘ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజల సహకారం మరియు పోలీసుల అప్రతిహత స్పందనతో తల్లి మరియు చిన్నారిని కెనాల్ నుండి బయటకు తీసి తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అనంతరం, చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం ఒంగోలు RIMS కు తరలించారు. మహిళకు కూడా అవసరమైన వైద్య సాయం అందిస్తున్నారు.దర్శి పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ—కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులను అధిగమించడానికి పోలీసులను, కౌన్సిలింగ్ సెంటర్లను సంప్రదించాలని, ఇలాంటి తీవ్ర చర్యలకు దిగరాదని సూచించారు.ప్రకాశం జిల్లా పోలీసులు సమాజంలో ఇలాంటి సంఘటనలు ఆగడానికి అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.