తొలి శుభోదయం కందుకూరు:-

పట్టణంలోని నారాయణ స్కూలు కందుకూరు ఈ టెక్నో ప్రైమరీ విద్యార్థులు ఒంగోలులో జరిగిన మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్లో అత్యంత ప్రతిభను కనపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా నారాయణ పాఠశాల ఏజీఎం పెద్దిరెడ్డి ఆర్ అండ్ డి హెడ్ నీలిమ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జోనుకు చెందిన పది బ్రాంచ్ల నుండి ఎంపికైన విద్యార్థులలో కందుకూరు ఈ టెక్నో స్కూలు విద్యార్థులు తమ అసాధారణ ప్రతిభను తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సెంట్రల్ ఆఫీసు నుండి విచ్చేసిన గౌరవ నీయుల సమక్షంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ పాఠశాల విద్యా విధానం విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి నమ్మకాన్ని పెంపొందించే కార్యక్రమం గురించి వారు ప్రశంసించారు. ప్రాథమిక స్థాయిలో జరిగిన మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ మరియు రైసింగ్ వాయిస్ క్యాటగిరిలో విద్యార్థులు ప్రసంగాల భావవ్యక్తీకరణ ధైర్య సాహసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి మరియు ప్రిన్సిపల్ అనీష్ భాను సాఫ్ట్ స్కిల్ అసిస్టెంట్ మేనేజర్ సాదిక్ ఆర్ఎస్టీ జీవన్ కోఆర్డినేటర్ స్వాతి వైస్ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *