తొలి శుభోదయం టంగుటూరు :-
ఈ సంవత్సరం 2025-26 పంట కాలానికి టంగుటూరు పొగాకు బోర్డు పరిధిలోని జరుగుమల్లి గ్రామం లో పొగాకు లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన పొగాకు ను పండించడానికి జరుగుమల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా ఎంచుకోవడం జరిగింది. శుక్రవారం అనగా 19.12.2025 తేదిన జరుగుమల్లి గ్రామం లో మీకు అవసరమైన ఇంధన కలపను మీరే స్వంతంగా పెంచుకోండి (Raise your own fuel) పథకం కింద టేకు, చింత,మద్ది,వేప మొదలైన మొక్కలు పొగాకు రైతులకు సరఫరా చేయడం జరిగింది.
వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాస రావు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వివరిస్తూ ఈ క్రింది విషయాలను రైతులకు తెలిపారు
పొగాకు రైతులు పొగాకు క్యురింగ్ కొరకు వారి స్వంత కలపను వారే స్వయంగా పెంచుకొనుట.
పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ పచ్చదనాన్ని పెంపొందించుట.
బారన్ క్యురింగ్ కొరకు అడవులను నరకరాదని తెలిపారు.పొగాకు బోర్డు ప్రొడక్షన్ పాలసీ ప్రకారం రైతుగా రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి బారన్ పరిధి లో 10 మొక్కలు నాటాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి శ్రీనివాస రావు , క్షేత్రాదికారి ఉపేంద్ర మరియు పొగాకు బోర్డు సిబ్బంది మరియు జరుగుమల్లి పొగాకు రైతులు పాల్గొన్నారు.
